Kitchenvantalu

Brinjal Chips :ఇలాంటి ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ తప్పకుండా చేసుకుంటారు

Brinjal Chips :వంకాయ చిప్స్..ఇన్ స్టంట్ ,ఇంట్లోనే ఉన్న పదార్ధాలతో ఎన్నో స్పాన్స్ తయారు చేసుకోవచ్చు.వంకాయలతో చిప్స్ చేసి చూడండి స్పైసీగా ,క్రిస్పిగా అదిరిపోతాయి.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 2
కారం – 1 స్పూన్
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

తయారీ విధానం
1.వంకాయలను కడిగి అర అంగులం చొప్పున గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.కట్ చేసిన ముక్కలను ఉప్పు వేసి టాస్ చేసుకోవాలి.
3.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండి,బొంబాయి రవ్వ,కారం ,ఉప్పు,నువ్వులు,కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లువేసి పేస్ట్ లా కలుపుకోవాలి.
4.ఉప్పుతో కలిపిన వంకాయలో నీళ్లు ఇంకి పోతుంది.
5.ఇప్పుడు కలుపుకున్న పిండి మిశ్రమంలో వంకాయ ముక్కలను ముంచి వేడి నూనెలో వేసుకోవాలి.
6.రెండు వైపులా తిప్పుతూ వడియాలు క్రిస్పిగా అయ్యే వరకు వేపుకుంటే వంకాయ వడియాలు రెడీ.