Kitchenvantalu

Stuffed Kakarakaya Curry:చేదు లేని గుత్తి కాకరకాయ.. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే..

Stuffed Kakarakaya Curry:స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై..కాకరకాయని చేదు లేకుంటా చేసుకుంటే ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు.మసాలలు పట్టిచ్చి గుత్తి కాకరకాయ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
ఉప్పు – తగినంత
ఎండు కొబ్బరి – ½ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 10-12
మిర్చి – 10

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను పై తొక్కను తొలగించి,నిలువుగా గాటు పెట్టుకోని విత్తనాలను తీసివేయాలి,చీల్చిన మద్యలో ఉప్పును స్ప్రెడ్ చేయండి.
2.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి కాకరకాయలను వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకు ఫ్రైచేసుకోని పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టఫింగ్ కోసం కడాయి లో ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ధనియాలు ,ఎండుమిర్చి ,ఎండు కొబ్బరి వేసి వేపుకోవాలి.
4.అందులోకి వేపుకున్న శనగపప్పును,వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి.

5.ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
6.గ్రైండ్ చేసుకున్న మసాలాను కాకరకాయలోకి స్టఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అదే కడాయిలో స్టఫ్ చేసుకున్న కాకరకాయలను వేసి వేపుకోవాలి.
8.స్టపింగ్ బయటికి రాకుండా తిప్పుతూ నెమ్మదిగా ప్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.