Kitchenvantalu

Bachali Kura Pachadi:బచ్చలి ఆకు పచ్చడి ఇలా చేస్తే ప్రతి ముద్ద వదలకుండా తింటారు

Bachali Kura Pachadi: బచ్చలి కూర పచ్చడి..పుష్కలంగా ఐరన్ దొరికే బచ్చలి కూర, వారంలో ఒక సారైనా తినాలి. పప్పులోనూ పచ్చడిగానో, మెనూలో యాడ్ చేసుకోవాలి. బచ్చలి కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బచ్చలి కూర – 1 కప్పు
పచ్చిమిర్చి – 7 లేదా 8
జీలకర్ర- 1 స్పూన్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి – 7 లేదా 8
చింతపండు – 15 గ్రాములు
ఉప్పు – 1 స్పూన్
తాళింపు గింజలు – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనే వేడి చేసి, శనగపప్పు, ఎండు మిర్చి, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి, వేపుకుని, పక్కన పెట్టుకోవాలి.
2.అదే పాన్ లో మరికాస్త ఆయిల్ వేసుకుని, బచ్చలి కూర వేసి, రంగు మారేవరకు, వేపుకుని, చల్లార్చుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్ లోకి, వేపి పెట్టుకున్న పప్పు దినుసులు, వేసుకుని, అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి,నాన బెట్టిన చింతపండు, వేసి గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులోకి ఫ్రై చేసిన బచ్చలి కూరను వేసి, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
5. ఇప్పుడు తాళింపు కోసం, స్టవ్ పై పాన్ పెట్టి, ఆయిల్ వేడి చేసుకుని, అందులోకి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు వేసుకుని వేగిన తాళింపు లోకి, గ్రైండ్ చేసుకున్న బచ్చలి కూర, పేస్ట్ ను వేసి కలుపుకోవాలి.
6. అంతే బలమైన బచ్చలి కూర పచ్చడి రెడీ.