Kitchenvantalu

Gobi Manchurian:పిల్లలు ఎంతో ఇష్టపడే గోబీ మంచూరియా.. ఈసారి ఈజీ గా ఇలా చెయ్యండి

Gobi Manchurian:గోబీ మంచురియా..స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడే మంచురీయాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.గోబీ పువ్వుతో మంచురీయ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కాలిఫ్లవర్ – 1
మైదా – 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
సాస్ కోసం ..
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు – ½ కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 2 టేబుల్ స్పూన్స్
టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్
సోయాసాస్ – 1 స్పూన్
వెనిగర్ – 1 స్పూన్
సోయాసాస్ – 1 స్పూన్
పెప్పర్ పౌడర్ – 1 స్పూన్
పచ్చిమిర్చి – 2
స్ప్రింగ్ ఆనియన్స్ – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి మైదా ,కార్న్ ఫ్లోర్,ఉప్పు,మిరియాలపొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తు కలుపుకోవాలి.
2.ఇప్పుడు కలుపుకున్న పిండిలో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి.
3.కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు నీళ్లలో పది నిమిషాలు నానబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలను జారుగా కలుపుకున్న మైదా పిండిలో ముంచుకోవాలి.
4.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి డిప్ చేసిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి వేపుకోవాలి.
5.ఇప్పుడు సాస్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనే వేసి తరిగిన వెల్లుల్లి,తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు,మిరిచాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి.

6.రుచికి సరిపడా ఉప్పు,సోయాసాస్,వెనిగర్ వేసి కలుపుకోవాలి.
7.ఇప్పుడు వేరొక గిన్నెలో టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని నీళ్లు యాడ్ చేసి కాస్తా జారుగా కలుపుకోవాలి.
8.కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని సాస్ లో గ్రేవికోసం పోసుకోవాలి.
9.ఇప్పుడు గ్రేవిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి.
10.చిక్క పడ్డ గ్రేవీలో వేపుకున్న కాలిఫ్లవర్ బాల్స్ ని వేసి టాస్ చేసుకుంటే గోబి మంచురీయా రెడీ.