Rice Cake:బేకరి స్టైల్‌లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
Rice Cake: రైస్ కేక్.. కేక్స్ లో ఎన్నో వెరైటీస్ మనం టేస్ట్ చేస్తునే ఉంటాం. కాని రైస్ తో ఎప్పుడైనా ట్రై చేసారా.ఈసారి చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
మైదా – ½ కప్పు
చక్కెర – ¼ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
గుడ్లు – 2
ఎసెన్స్ – కొద్దిగా
నిమ్మరసం – ½ టీ స్పూన్
బేకింగ్ సోడా – ½ టీ స్పూన్
పాలు – ½ కప్పు
తయారీ విధానం
1.ముందుగా బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానబెట్టిన బియ్యాన్ని మిక్సి జార్ లో వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
3.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి గుడ్లను పగుల గొట్టి సొన తీసుకోవాలి.
4.అందులోకి పంచదారను,గ్రైండ్ చేసుకున్న రైస్ పేస్ట్ ని మల్లీ గ్రైండ్ చేసుకోవాలి.
5.పేస్ట్ ని ఒక గిన్నెలో ట్రాన్సఫర్ చేసుకోవాలి.
6.అందులోకి మైదా,ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
7.ఇప్పుడు పాలను యాడ్ చేస్తు కేక్ మిశ్రమం లా కలుపుకోవాలి.ఎక్కువ జారుగా చేయకూడదు.
8.అందులోకి ఎసెన్స్,బేకింగ్ సోడా,నిమ్మిరసం,వేసి కలుపుకోవాలి.
9.ఇప్పుడు గిన్నె అడుగు భాగంలో నూనె రాసి తయారు చేసుకున్న పిండిని వేసుకోవాలి.
10.పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.
11.ఇప్పుడు స్టీమింగ్ కోసం ప్రెషర్ కుక్కర్లో అడుగున రెండు కప్పుల నీళ్లను పోసుకోవాలి,స
12.అడుగున వాటర్ పై స్టాండును పెట్టి దాని పై కేక్ బౌల్ ని ప్లేస్ చేసుకోవాలి.
13.ఇప్పుడు విజిల్ లేకుండా మూతను ఆవిరి పోకుండా పెట్టి హై ఫ్లేమ్ పై కాసేపు ఉడికించి,ఆతర్వాత పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై స్టీమ్ చేసుకోవాలి.
14.ఇప్పుడు కేక్ ను చెక్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని వేరోక ప్లేట్ లోకి బోర్లించుకోవాలి.
15.అంతే రైస్ కేక్ రెసిపీ రెడీ.


