సైనస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..
Tips For Reduce Sinus Problem : సైనస్ గా సుపరిచితమైన సైనసైటిస్ (Sinusitis) చాలా మందిని పట్టి పీడుస్తున్న సమస్య. పైకి జలుబుగా కనిపించినా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. పది మందిలో ఇద్దరు ఈ సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా నివారించటం సాధ్యం కాకపోయినా కొన్ని చిట్టి పొట్టి చిట్కాల ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
పచ్చి వెల్లుల్లి,ఉల్లిపాయను ఎక్కువగా తినటానికి అలవాటు చేసుకుంటే సైనస్ తీవ్రతను తగ్గించటానికి దోహదం చేస్తాయి. పాలు,చక్కెర తక్కువగా వేసుకొని,అల్లం లేదా దాల్చిన చెక్క వేసిన టీని రోజుకి రెండు,మూడు సార్లు త్రాగితే మంచి పలితాన్ని పొందవచ్చు. నాలుగైదు గ్లాసుల పళ్ళరసం త్రాగితే మంచిది. అలాగే పాలు,పాలధారిత ఉత్పత్తులను పూర్తిగా మానివేయాలి.
అల్లం రసాన్ని రోజు మొత్తంలో రెండు స్పూన్స్ తీసుకోవాలి. కప్పు నీటిలో ఆవాలు వేసి మరిగించాలి. నీరు పావు వంతు వచ్చేవరకు మరిగించి,అనంతరం ఆ నీటిని చల్లార్చి వడకట్టి,ఒకటి,రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ఉపశమనం పొందవచ్చు. బట్టలో కొద్దిగా జీలకర్ర వేసి దాన్ని మడిచి తరచూ వాసన చూడటం ద్వారా సైనస్ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.
ఒకటి లేదా రెండు స్పూన్స్ నీటిలో అంతే పరిమాణంలో యాలకుల పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని ముక్కు చుట్టూ అప్లై చేయాలి. కప్పు నీటిలో రెండు లేదా మూడు స్పూన్స్ మెంతులు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి,రోజు మొత్తంలో రెండు,మూడు సార్లు త్రాగాలి. పై పద్దతులు అన్ని సైనస్ తీవ్రతను తగ్గించటానికి మాత్రమే దోహదం చేస్తాయి. కానీ వీటి వల్ల పూర్తిగా నివారణ జరగదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.