Healthhealth tips in telugu

హై బీపీ ఉన్నవారు వీటిని తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు

Best Dry Fruits to Lower Blood Pressure : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడుతూ ఖచ్చితంగా అరగంట వ్యాయామం చేస్తూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.

అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేదా డ్రై సీడ్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో డ్రై ఫ్రూట్స్ కీలకమైన పాత్రను పోషిస్తాయి.

జీడిపప్పు రక్తపోటు నియంత్రణకు నేచురల్ రెమెడీగా చెప్పవచ్చు. వీటిలో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. దీనివల్ల రక్తపోటును సులభంగా నియంత్రించుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకి 3 లేదా 4 జీడిపప్పులను తీసుకోవాలి.

పిస్తా పప్పులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. రోజుకి 3 లేదా 4 పిస్తా పప్పులు తీసుకుంటే సరిపోతుంది.

బాదం పప్పులో ఉండే ఆల్ఫా టోకోఫెరోల్‌ రక్తపోటును నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదం పప్పు తొక్క తీసి తినాలి. అలాగే డయాబెటిస్, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.