Beauty Tips

అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే… పైనాపిల్ తో ఇలా చేయండి

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ సంరక్షణ కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని కూడా వృదా చేసేస్తూ ఉంటారు.

కాస్త పులుపు తీపి రుచి కలిగిన పైనాపిల్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం పైనాపిల్ చాలా విరివిగా లభ్యమవుతున్నాయి. విటమిన్ ఏ బి సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపు మెరుగు పడుతుంది.

మనలో చాలా మందికి పైనాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలుసు. కానీ అందాన్ని కూడా పెంచుతుంది అని మనలో చాలా మందికి తెలియదు. మొటిమలను తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక స్పూన్ పైనాపిల్ జ్యూస్ లో అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలిగిపోతాయి.

చర్మంపై మృతకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే ఈ ప్యాక్ చాలా కరెక్ట్ గా పనిచేస్తుంది పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."