Munagaku Podi:ఎన్నో వందల వ్యాధులని నయం చేసే మునగాకుతో రుచికరమైన కారప్పొడి
Munagaku Podi:మునగాకు పొడి..మునగ బలం అందరికి తెలిసింది.మనక్కాడలే కాదు,ఆకులతో కూడ చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.మునగాకు పొడి ఒక్క ముద్దరోజు తిన్నారంటే ఎముకలు గట్టిగ తయారైతాయి.మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మనగాకులు – 1 కప్పు
జీలకర్ర – ½ టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
పల్లీలు – 2 టీస్పూన్స్
మినపప్పు – 2 టీ స్పూన్స్
శనగపప్పు – 2 టీ స్పూన్స్
ఎండుమిర్చి – 7-8
వెల్లుల్లి రెబ్బలు – 7-8
కరివేపాకు – ½ టీ స్పూన్
చింతపండు – 20 గ్రాములు
ఉప్పు – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా మునగాకు శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడి చేసి అందులో మునగాకు వేసి తడి లేకుండా వేయించుకోవాలి.
3.వేపుకున్న ఆకులను వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
4.ఇప్పుడు కరివేపాకు ను కూడా వేపుకోని పక్కనపెట్టుకోండి.
5.ఇప్పుడు అదే ప్యాన్ లోకి శనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి,పల్లీలు ,ధనియాలు,జీలకర్ర,వెల్లుల్లి రెబ్బలు,చింతపండు వేసి కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.అన్ని పదార్ధాలను చల్లారనివ్వాలి.
7.చల్లారిన తర్వాత మిక్సి జార్ వేసుకోని ఉప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
8.అంతే మునగాకు పొడి రెడీ.