Movies

ఈ టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా…ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి

పాతజ్ఞాపకాలు అందరికి ఉంటాయి. మదిలో మెదిలే వాటిని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక షేర్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా తమ జ్ఞాపకాలను తవ్వి తీస్తూ,ఓల్డ్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి చూసాక అతనా, ఈమేనా ఇలా ఉన్నారేంటి ,అస్సలు గుర్తుపట్టలేం కాదా ఇలా రకరకాలుగా అనిపిస్తుంది.

తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటోలో చూస్తున్న హీరో కూడా అంతే. ఈయన కూడా తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సందడి లేకుండా చాలా సైలెంట్‌గా వచ్చాడు. అతనెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు కి బావ అయిన సుధీర్ బాబు.సుధీర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినపుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చాడని చాలా మందికి తెలియదు. ఆ తర్వాత తెలిసిపోయింది.

బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ ని నమ్ముకుని చిన్న సినిమాలతో.. తనకు సూట్ అయ్యే పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక అప్పుడప్పుడూ తన సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబును కూడా బాగానే వాడేస్తుంటాడు.

కేవలం సినిమాలు మాత్రమే కాదు. బ్యాడ్మింటన్‌లో నేషనల్ ప్లేయర్ కూడా అయిన సుధీర్ కి ఆ తర్వాత క్రికెట్‌లో కూడా ప్రవేశం ఉంది. ఇక ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటి హీరోలు చాలా మంది సుధీర్‌ను చూసి వావ్ అంటారు. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నపుడు ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంకు కూడా సాధించాడు.

బ్యాడ్మింటన్ స్టార్, కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిస డబుల్స్ పార్ట్‌నర్‌గా కూడా ఉన్నాడు. అప్పట్లో తాను మెడల్ అందుకున్నప్పటి అరుదైన ఫోటోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అది విపరీతంగా వైరల్ అయింది.