Healthhealth tips in telugu

Health Tips:బెల్లం,ధనియాలు కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా…అసలు ఊహించలేరు

coriander seeds and jaggery Uses In telugu : మనం ప్రతి రోజు ఏదో ఒక రకంగా బెల్లం వాడుతూ ఉంటాం. బెల్లంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా తినమని చెప్పుతున్నారు. అలాగే ధనియాలలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ధనియాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని చెప్పవచ్చు. ధనియాలు యాంటీ బయటిక్ గా కూడా పనిచేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న బెల్లం,ధనియాలను కలిపి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు దూరం అవుతాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించి ఎముకలు గుల్లబారడం, పేలుసుగా మారటం వంటివి కూడా ఉండవు.

నోటి దుర్వాసన సమస్య ఉన్నప్పుడు కూడా బెల్లం,ధనియాలు కలిపి తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గటమే కాకుండా చిగుళ్ళ సమస్యలు కూడా ఉండవు.

ఈ మధ్య కాలంలో చాలా మంది మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి  పడుకోవటానికి అరగంట ముందు బెల్లం,ధనియాలను తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడతారు. జీర్ణ వ్యవస్థ  పనితీరు మెరుగుపడి  గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ధనియాలను,బెల్లం ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…ధనియాలను పొడిగా చేసుకోవాలి. అరస్పూన్ ధనియాల పొడిలో అరస్పూన్ బెల్లం కలిపి తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.