Healthhealth tips in telugu

Date seeds:ఖర్జూరం తిని గింజలు పాడేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు

Date seeds benefits in Telugu :సాధారణంగా మనం ఖర్జూరం తిని గింజలను పాడేస్తూ ఉంటాం. అయితే ఆ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఖర్జూరం గింజలను నేరుగా తినలేము.

కాబట్టి పొడిగా తయారుచేసుకుని ఉపయోగించాలి.ఈ గింజలలో ,కాడ్మియం, calcium, పొటాషియం, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన DNA దెబ్బతినకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేయడం చేస్తుంది.

యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వలన కిడ్నీలు, కాలేయం దెబ్బతినకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేసి చర్మ సమస్యలను జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా తెల్ల జుట్టును నివారిస్తుంది.

ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం యొక్క DNA నిర్మాణాన్ని రక్షించటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఈ గింజల పొడి ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ గింజల పొడిని ఒక వారం రోజుల పాటు వాడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతుంటారు

ఖర్జూరం గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేయడమే కాకుండా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్సగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యం మెరుగుదలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు

ఖర్జూర గింజలను వేగించి పొడిగా తయారుచేస్తారు. ఈ పొడిని కొంతమంది కాఫీలో కలుపుకొని తీసుకుంటారు. మరి కొంతమంది టీలో కలిపి తీసుకుంటారు. కొందరు. స్ముతి ల్లోనూ… కేక్ టాపింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.