Healthhealth tips in telugu

Packet Milk Side Effects:ప్యాకెట్ పాలు కొని వాడుతున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

packet Milk Benefits in telugu :పాలు వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే ఉదయం లేవగానే టీ తాగటం రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకోవటం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. చిన్న పిల్లలు కూడా పాలను ఎక్కువగా తాగుతుంటారు.

ఒక రకంగా చెప్పాలంటే పాలను రోజులో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూనే ఉంటారు. పాలల్లో చాలా రకాలు ఉన్నాయి మార్కెట్లో పాలు చాలా రూపాల్లో లభ్యమౌతుంది. అయితే చిన్న పిల్లలు ఏ పాలు తాగాలి పెద్ద వారు ఏ పాలు తాగాలి అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి.

సాధారణంగా మనలో చాలామంది ఉదయం లేవగానే మార్కెట్ కు వెళ్లి పాల ప్యాకెట్లు తేవటం వాటిని తాగటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది గేదె లేదా ఆవు నుంచి తీసిన స్వచ్ఛమైన పాలను వాడుతూ ఉంటారు మరి కొంత మంది టెట్రా ప్యాక్ లో ఉన్న పాలను వాడుతూ ఉంటారు.

గేదె లేదా ఆవు పాలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ పాలల్లో ఎటువంటి కల్తీ ఉండదు. అవి పాశ్చరైజేషన్ చేయని పాలు. కాబట్టి.. ఆ పాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

అయితే ప్యాకెట్ పాలు టెట్రా ప్యాక్ లో లభించే పాలను పోల్చి చూస్తే ఏ పాలు మంచిది అనే విషయానికి వస్తే టెట్రా ప్యాక్ లో లభించే పాలు సురక్షితం అని చెబుతూ ఉంటారు ఎందుకంటే టెట్రా ప్యాక్ ను అల్ట్రా హై టెంపరేచర్ పద్ధతిలో తయారు చేస్తారు. అంటే ఈ పాలను హై టెంపరేచర్ లో వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేస్తారు అలా చేయటం వలన ఆ పాలలో ఉన్న మైక్రోమ్యాక్స్,ప్యాథోజెన్స్ నశిస్తాయి.అందువల్ల ఆ పాలను తాగితే ఎటువంటి సమస్య ఉండదు.

కొంతమంది ప్యాకెట్ పాలను వాడుతూ ఉంటారు. ప్యాకెట్ పాలు ఒక టెంపరేచర్ వద్దనే పాశ్చరైజ్ చేస్తారు. దాని వల్ల.. కేవలం మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే నశిస్తాయి కానీ.. ప్యాథోజెన్స్ నశించవు. అందుకే.. ప్యాకెట్ పాల లైఫ్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."