Healthhealth tips in telugu

Coffee And Tea:రాత్రిపూట కాఫీ,టీ ఎక్కువగా తాగేస్తున్నారా… మీరు రిస్క్ లో పడినట్టే

coffee And Tea Side Effects In telugu : ప్రతి రోజు ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగితే కానీ ఆ రోజు గడవదు అలా కాఫీ లేదా టీ తాగడం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటాం. మనలో చాలా మంది ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని కాఫీ లేదా టీ తాగేస్తుంటారు.

కాఫీ లేదా టీ మితంగా తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఎక్కువగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా కాఫీ తాగే అలవాటు వ్యాపారం చేసే వారికి ఉద్యోగం చేసే వారికి ఉంటుంది. ఉదయం సమయం సాయంత్రం సమయం రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ లేదా టీ తాగితే మంచిది.

కొంతమంది రాత్రి సమయంలో కూడా కాఫీ,టీ తాగుతూ ఉంటారు అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు రాత్రి సమయంలో కాఫీ లేదా టీ అస్సలు తాగకూడదు తాగితే ఏమవుతుంది అనే విషయానికి వస్తే ఒక కప్పు కాఫీ లో 150 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఒక కప్పు టీ లో 150 మి.లీ గ్రాముల టీఎన్ఉంటుంది. ఇవి నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. అందుకే కాఫీ లేదా టీ తాగినప్పుడు రిఫ్రెష్ అయినట్టే అనిపిస్తుంది అయితే ఈ స్టిములెంట్స్ ఒక గంట మాత్రమే ఉంటాయి ఆ తర్వాత నరాల వ్యవస్థ బలహీనమవుతుంది.

ఒక్కసారిగా నరాల వ్యవస్థ ఉద్రేకపడటం ఒక్కసారిగా తగ్గి పోవడం వలన డిప్రెషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే కాఫీ టీలు ఎక్కువగా తాగడం ముఖ్యంగా రాత్రి సమయంలో తాగడం వలన కలిగే నష్టం గురించి తెలుసుకుందాం రాత్రిపూట మాత్రమే మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది ఈ హార్మోన్ విడుదల అయితేనే నిద్ర వస్తుంది

శరీరం మొత్తం రిలాక్స్ స్టేజ్ లోకి వెళుతుంది రాత్రి సమయంలో తాగితే నిద్ర రావటానికి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ విడుదల కాదు దాంతో నిద్రపట్టక నిద్రలేమి సమస్యలు వస్తాయి అంతేకాకుండా సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

కాబట్టి సాధ్యమైనంతవరకు కాఫీ లేదా టీ తాగాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే తాగటానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో తాగకండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.