MoviesTollywood news in telugu

Tollywood:ఏంటి.. మన ఇండస్ట్రీలోనే ఇంతమంది ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారా..?

Tollywood Heroes:డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లను చూస్తాం,అలాగే డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ అయిన వాళ్ళూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీకి రాకముందు కొందరు మంచి ప్లేయర్స్ గా రాణించిన హీరో హీరోయిన్స్,డైరెక్టర్స్ ఉన్నారు.

అందులో ముందుగా లవర్ బాయ్ త‌రుణ్ ని తీసుకుంటే యితడు రంజీ లెవ‌ల్ లో క్రికెట్ ఆడాడు.! మంచి ఆల్ రౌండ‌ర్ గా పేరున్న త‌రుణ్ కు సినిమాల్లో అవ‌కాశం రావ‌డం…వ‌రుస‌గా హిట్స్ ప‌డ‌డంతో క్రికెట్ ప్రొఫేష‌న్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయ్యాడు.

ఇక అక్కినేని వారసుడు నాగచైతన్య మంచి కార్ రేస‌ర్.! రేసింగ్ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. ఇప్ప‌టికే చాలా రేస్ స‌ర్క్యూట్స్ కంప్లీట్ కూడా చేశాడు. ఫార్ములా వ‌న్ రేసింగ్లంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని కూడా చాలా సార్లు చెప్పాడు. మరో యువ హీరో అఖిల్ మంచి క్రికెట‌ర్ ఆస్ట్రేలియాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు.!

కానీ అనూహ్యంగా క్రికెట్ ను వ‌దిలేశాడు. సెలెబ్రిటీ లీగ్ లో మ‌నోడి క్రికెట్ టాలెంట్ చూపించాడు. ఇక నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అయిన అవసరాల శ్రీనివాస్ ప్రొఫెషనల్ రాకెట్ బాల్ ఆటగాడు. 2014 లో దక్షిణ కొరియాలో జ‌రిగిన ఆసియా ఓపెన్ రాకెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్ జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయ‌ర్.! సినిమాల్లోకి వ‌చ్చాక కూడా అప్పుడ‌ప్పుడు గోల్ఫ్ అడుతూనే ఉంటుంది. ఇక గురు సినిమాలో బాక్స‌ర్ పాత్ర పోషించిన రితికా సింగ్ రియ‌ల్ లైఫ్ లో కిక్ బాక్సింగ్ , మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంది. యంగ్ హీరో నాగ‌శౌర్య జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడు.

సినిమాల్లోకి రాకుముందు టెన్నిస్ ట్రైనింగ్ లోనే ఎక్కువ‌గా గ‌డిపేవాడు. కాగా సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు,మహేష్ బావ సుధీర్ బాబు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఫుల్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ లో సుధీర్ హీరోగా చేస్తున్నాడు.