Healthhealth tips in telugu

Weight Loss Tips:వారంలో 2 సార్లు తాగితే శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె సమస్యలు రావు

powerful drink to prevent heart attack in telugu: ఈ మధ్యకాలంలో గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త సరఫరా ఆగి గుండె పనితీరుకు ఆటంకం ఏర్పడి గుండె జబ్బులు వస్తున్నాయి. ఇలా గుండె జబ్బులు రావడానికి కారణమైన కొవ్వును కరిగించుకోవడానికి ఈరోజు ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ తయారుచేసుకోవటం చాలా సులువు.

దీని కోసం నాలుగు మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని పక్కన పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక దంచి ఉంచుకున్న మిశ్రమాన్ని దానిలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని వడగట్టి తేనె కలుపుకుని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో, రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దాల్చిన చెక్క రక్తప్రసరణను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. మిరియాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

వెల్లుల్లి ధమనుల్లో ఉండే పలకాన్ని తొలగిస్తుంది. పసుపు కూడా కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కరిగించటానికి సహాయపడుతుంది. ఏదైనా లిమిట్ గా తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.