MoviesTollywood news in telugu

పెళ్లి సందడి హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. గుర్తుపట్టలేనంతగా..

Tollywood Top heroine ravali :ఇటీవల ఒక వేడుకలో అలనాటి హీరోయిన్‌ రవళిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పైగా బాగా లావుగా మారిపోవడంతో గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌లు అతిధులుగా హాజరై,రవళిని చూసి షాకయ్యారు.

తన అందం, అభినయంతో 90దశకంలో హీరోయిన్‌గా వెలుగొందిన రవళి ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకుంది అప్పట్లో తన క్యూట్‌ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు లావుగా,బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా అయింది.

‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకుంది. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నా అని కూడా చమత్కరించింది. నటి రవళి తెలుగుతో పాటు తమిళం. కన్నడతో సహా దక్షిణ భారత భాషలలో నటించింది.

అలాగే పాతికేళ్ల క్రితం శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా వచ్చారు.చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు.

ఎందుకంటే, నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశా. అయినా రాఘవేంద్ర రావు పిలిస్తే,ఏ స్టేజ్‌లో, ఎలా ఉన్నా వస్తాను. అందుకే వచ్చాను ’ అంటూ రవళి చెప్పింది. ఇక రవళి 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు, వ్యాపారి నీలకృష్ణను పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది. 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."