MoviesTollywood news in telugu

Ayalaan OTT Release Date: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

Ayalaan OTT Release Date:ఏలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన అయ‌లాన్ సినిమాలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు ఆర్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతి కానుకగా విడుదల అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

అయ‌లాన్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను స‌న్ నెక్స్ట్ ఓటీటీ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది.

అయితే ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. 2016లో సినిమాను అనౌన్స్‌చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు 2024లో రిలీజైంది.

ఈ సినిమాలో ఎలియ‌న్ పాత్ర‌కు సిద్ధార్థ్ వాయిస్ ఓవ‌ర్ అందించాడు. ఈ సినిమాకు సిద్ధార్థ్, శివ‌కార్తికేయ‌న్ ఇద్దరూ కూడా పారితోషికం తీసుకోకుండా పనిచేసారు. కోలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజైన అయ‌లాన్ మూవీ తెలుగులో మాత్రం రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.