Healthhealth tips in telugu

Cholesterol:ఈ Juice లను తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తంను క్లీన్ చేస్తుంది

Bad cholesterol Reduce Juice: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబందించిన సమస్యలు వస్తాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి దానిమ్మ వంటి ఫ్రూట్ జ్యూస్ లు చాలా బాగా సహాయపడతాయి. రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ ఈ జ్యూస్ లను తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

దానిమ్మ జ్యూస్ తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అనేక పండ్ల రసాల మాదిరిగానే, దానిమ్మ రసంలో కూడా యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉంటాయి. దానిమ్మ రసం ఇతర పండ్ల రసాలతో పోలిస్తే కంటే అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే ధమనుల్లో పలకాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

టమోటా కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడుతుంది. టమోటా గుండె ఆరోగ్యంలో సహాయపడుతుందని కొన్ని పరిశోదనల్లో తేలింది. టమోటాలో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. టమోటాలో విటమిన్ A,C, ఫోలిక్ యాసిడ్ ఉండుట వలన హోమోసిస్టీన్ స్థాయిలను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్ మరియు నియాసిన్ కూడా పుష్కలంగా టమోటాలో ఉన్నాయి.

ఆరెంజ్ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ (పెక్టిన్) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.orange ని తొనల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

ఈ జ్యూస్ లలో ఏదో ఒక దానిని తీసుకోండి. ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఒక గ్లాసు జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ లెవల్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు,ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.