Ginger Peel:తొక్క తీయకుండా అల్లం తింటున్నారా…ఈ నిజాలు తెలుసుకోవలసిందే
ginger Peel Side Effects in telugu :అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. మనం ప్రతిరోజు అల్లంను వంటల్లో వాడుతూనే ఉంటాం కొంతమంది అల్లంతో టీ పెట్టుకొని ఉదయం లేవగానే తాగుతూ ఉంటారు. అలా ప్రతి రోజు ఏదో ఒక రూపంలో అల్లంను ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. .
ప్రతి రోజూ అల్లం వాడుతున్నా ప్రతి ఒక్కరూ ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే అది పొరపాటు అన్న విషయం కూడా వారికి తెలియదు. మనలో చాలా మంది అల్లంను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా వాడేస్తూ ఉంటారు. అలా వాడితే ప్రమాదమని నిపుణులు అంటున్నారు. అల్లం ను ఖచ్చితంగా తొక్కతీసి వాడాలని చెబుతున్నారు.
దానికి కూడా ఒక కారణం చెబుతున్నారు. అల్లం భూమిలో పెరుగుతుంది కదా. ఆ సమయంలో భూమిలో ఉండే సూక్ష్మజీవులు., కీటకాలు అల్లం లోపలికి వెళ్లకుండా అల్లం పైన ఉన్న తొక్క అడ్డుపడుతుంది. అలా అల్లం పైనున్న తొక్కలో విషపదార్థాలు చేరతాయి. అందువల్ల అల్లము తొక్కతీసి ఉపయోగించాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్లంను ఎక్కువగా వాడుతూ ఉంటాం. శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి అల్లంను రోజు తీసుకోవాలి. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.