Kitchenvantalu

Sweet Potato Pulusu:అన్నములోకి చాలా రుచిగా ఉండే చిలకడ దుంప పులుసు.. రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు

Sweet Potato Pulusu Recipe: తియ్యటి చిలగడ దుంపలను కొంచెం పుల్లగా , ఘాటుగా పులుసు చేసి చూడండి. మనం చేసుకునే పల్చని పులుసులు కాకుండా తమిళనాడు స్టైల్లో చిక్కగా , స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
చిలగడ దుంపలు – 300 గ్రాములు
పులుసు కారం పొడి కోసం..
ఆవాలు – ½ టీ స్పూన్
మెంతులు – ¼ టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
మిరియాలు – ½ టీ స్పూన్
కొబ్బరి – ¼ కప్పు
పులుసు కోసం..
నూనె – 6 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి- 4
సాంబార్ ఉల్లిపాయలు – 25
కరివేపాకు – 2 రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు – 10-12
ఉప్పు – తగినంత
టమాటో ముక్కలు – 1 కప్పు
కారం – ¾ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
చింతపండు పులుసు – 100-125 ml
నీళ్లు – ½ లీటర్

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకోని పులుసు కారం పొడి కోసం పెట్టుకున్న పధార్ధాలన్ని వేసుకోని ఎర్రగా వేపుకోవాలి.
2. అదే బాండీలో నూనె వేసి వేడెక్కిన ఆవాలు ,ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు,వేసి ఉల్లిపాయలు మెత్తపడి రంగు మారే వరకు వేపుకోవాలి.
3. వేగిన ఉల్లిపాయల్లో టొమాటో ముక్కలు ,ఉప్పు వేసి గుజ్జు అయ్యేవరకు మగ్గించుకోవాలి.

4. అందులోకి కారం ,ధనియాల పొడి వేసి చింత పండు పులుసు వేసి ఒక పొంగు రానివ్వాలి.
5. పొంగుతున్న పులుసులో చిలగడ దుంపల ముక్కలు నీళ్లు పోసి బాగా కలుపుకోని మూతపెట్టి 30 నిమిషాలు వదిలేయాలి.
6. చివరగా కొత్తిమీర తరుగు వేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుమ ఘుమ లాడే చిలగడ దుంపల పులుసు తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News