BusinessKitchen

kitchen gadgets: వీటిని వాడితే వంటింటిలో పని సులభం అవుతుంది

Best Useful Kitchen Gadgets: మన వంటింటిలో కొన్ని వస్తువులను వాడితే పని చాలా సులభం అవుతుంది. వాటిని మనం online store నుండి కొనుగోలు చేయవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మన ఇంటిలో సాదారణంగా శుభ్రం చేసిన పాత్రల్ని పెట్టటానికి బాస్కెట్‌ తరహా డిష్‌ డ్రైనర్స్‌ని వాడుతూ ఉంటాం. వాటిని వాడటం వలన ఆ ప్రాంతంలో నీళ్లు కింద పడుతుంటాయి.అలా కాకుండా కడిగిన పాత్రల్ని సులభంగా ఆరబెట్టుకోవడానికి, వాటి నుంచి నీళ్లు నేలపై పడకుండా ఉండేందుకు… సింక్‌పై ఏర్పాటుచేసుకునే ఈ డిష్‌ డ్రైనర్స్‌ ఉపయోగపడతాయి.

నీళ్ల సీసాలు, జ్యూస్‌ బాటిశ్లని శుభ్రం చేయడం అనేది చాలా కష్టమైన పని. బాటిళ్ల అంచుల దగ్గర, మూతలోపల బ్యాక్టీరియా చేరుకుని పాచి వాసన వస్తుంటాయి. వీటిని శుభ్రం చేయటం మాములు బ్రష్ లతో సాధ్యం కాదు. ఇటువంటి వాటిని శుభ్రం చేయటానికి త్రీఇన్‌వన్‌ బ్రష్‌ ఉంటే సరిపోతుంది. మూడు రకాల కుచ్చులతో శుభ్రం చేయటానికి చాలా సులభంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News