Kitchenvantalu

Aloo Methi Parata:ఈ ఆకుతో ఆలూ పరోటా ఇలా చేశారో అంతే..టేస్ట్ అదుర్స్ అనాల్సిందే..

Aloo Methi Parata Recipe:లంచ్ బాక్స్ లోకి రైస్ ప్లేస్ ని కవర్ చేయాలంటే.. అది పరాటానే. ఒక్క పరాటా తిన్నామంటే కడుపు నిండి పోతుంది. హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథీ పరాటాను మీ లంచ్ బాక్స్ మెనులోకి యాడ్ చేసి చూడండి.

కావాల్సినా పదార్ధాలు
గోధుమ పిండి- 2 కప్పులు
మెంతి కూర ఆకు తరుగు- 1 కప్పు
ఉడికించిన ఆలు- 2
పచ్చిమిర్చి తురుము- 2
నలిపిన వాము – ¼ టీ స్పూన్
వెల్లుల్లి – 5
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
నూనె – 1 టేబుల్ స్పూన్ (పిండిలో కలుపడానికి)
నూనె – 4 టేబుల్ స్పూన్స్ ( పరాటా కాల్చుకోవాడినికి)

తయారి విధానం
1.మెత్తగా ఉడికించిన ఆలుని, వెల్లుల్లిని తురుముకోవాలి.
2. తురుముకున్న ఆలూలో మిగిలిన పదార్ధాలన్ని వేసి ముందు నీళ్లు వేయకుండా పిండిని గట్టిగా కలుపుకోవాలి.
3. తరువాత కొద్ది కొద్దిగా నూనె వేసి మరో నిమిషం పాటు కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

4.నానిన పిండిని పెద్ద ముద్దలు గా చేసుకోని పల్చగా వత్తుకోవాలి. కాస్త నూనె పూసి సమోస ఆకారంలో మడత వేసి మళ్లీ వత్తుకోవాలి.
5. త్రిభుజాకారంలో వత్తుకున్న పరాటాను పెనం పై వేసుకోని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
6. అంతే .. హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథీ పరాటాలు రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News