Healthhealth tips in telugu

Onions:ఉల్లిపాయని ఇలా తింటున్నారా…అయితే ప్రమాదంలో పడినట్టే !

Store Peeled Onions : ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు సల్ఫర్ ఉండటం వల్ల చాలా ఘాటుగా ఉంటుంది ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు వచ్చిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.ఉల్లిపాయ లేనిదే కూర ఉండదు. ఉల్లిపాయ వేస్తే కూరకు రుచి వస్తుంది.

కొంతమంది ఉల్లిపాయను పచ్చిగా కూడా తింటారు. ఉల్లిపాయ ను ఎలా తీసుకున్నా ఉల్లిపాయ లో ఉన్న అన్ని ప్రయోజనాలు మన శరీరానికి కలుగుతాయి. ఉల్లిపాయ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే ఉల్లిపాయ తినే విషయంలో చాలామంది చేసే ఒక తప్పు ఉంది.

మనలో చాలా మంది సమయం కలిసి వస్తుంది కదా అని రాత్రి సమయంలో ఉల్లిపాయ కట్ చేసుకుని ఉదయం వాడుతుంటారు. మరి కొంతమంది ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసిన గంట లేదా రెండు గంటల తర్వాత వాడుతూ ఉంటారు. కానీ ఇలా వాడటం చాలా తప్పు ఉల్లిపాయను వాడే సమయంలోనే కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి నిల్వ ఉంచడం వలన విషంగా మారి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినప్పుడు అవి గాలి మరియు అనేక రకాల బ్యాక్టీరియాలను పీల్చుకుంటాయి అంతేకాకుండా అదే సమయంలో పులి లో కొన్ని టాక్సిన్స్ విడుదలవుతాయి ఇలాంటి ఉల్లిపాయముక్కలు తీసుకుంటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉల్లిపాయను వాడే సమయంలో మాత్రమే కోయటం అలవాటు చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.