Kitchenvantalu

Brinjal Cucumber Chutney:వంకాయ‌లు, దోస‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. సూపర్ గా ఉంటుంది

Brinjal Cucumber Chutney Recipe: విడివిడి గా చేసిన కూరలకన్నా.. మిక్సింగ్ వెజిటెబుల్స్ తో చేసే కర్రీస్ కాస్తా రుచి ఎక్కువగానే ఉంటాయి. కాల్చిన వంకాయతో దోసకాయ పచ్చడి చేసి చూడండి.

కావాల్సిన పధార్ధాలు
పెద్ద వంకాయలు- 300 గ్రాములు
పెద్ద దోసకాయ- 150 గ్రాములు
పచ్చిమిర్చి- 7-8
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
చింతపండు- కొద్దిగా
వెల్లుల్లి – 4-5 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా
నూనె – 1 టీ స్పూన్

తయారి విధానం
1 .వంకాయలకు నూనె పోసి సన్నని సెగ పై మెత్తపడే వరకు కాల్చుకోవాలి.
2.కాల్చుకున్న వంకాయల మీద నీళ్లు పోసి పొట్టు తీసి గింజలు కూడ తీసేయ్యాలి.
3.తీసుకున్న వంకాయ గుజ్జు,పచ్చిమిర్చి,జీలకర్ర,చింతపండు,వెల్లుల్లి,ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
4.గ్రైండ్ చేసుకున్న వంకాయ గుజ్జులో కట్ చేసి గింజలు తీసుకున్న దోసకాయ ముక్కలు కలిపి అరగంట పాటు నాననివ్వాలి.
5.అంతే అరగంట తర్వాత కలుపుకోని సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News