Healthhealth tips in teluguKitchen

Cooking Oil: ఒకసారి వాడిన వంటనూనెను ఏమి చేస్తున్నారు.. ఇలా చేస్తే వేస్ట్ కాదు..

Reuse Of Cooking Oil in telugu: ఒకసారి వాడిన వంటనూనెను చాలా మంది వాడుతూ ఉంటారు. ఆ నూనెను వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సాదారణంగా పూరీలు, పకోడీలు, వేయించిన వంటకాలు చేసినప్పుడు నూనె మిగులుతూ ఉంటుంది. ఒక సారి వాడిన నూనెను తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఈ నూనెను ఉపయోగించటానికి ముందు బాగా ఫిల్టర్ చేయాలి.

ఈ నూనెను కూరలను వండినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అలాగే రెండు రోజుల వరకు మాత్రమే ఈ నూనెను వాడాలి. అలా కాకుండా వాడితే మాత్రం ప్రమాదం అని నిపుణులు అంటున్నారు.

నూనెను ఒకసారి ఉపయోగించితే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే ఆ నూనె చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, ఒక సారి వాడిన నూనెను తిరిగి వాడకపోవడం మంచిది. అయితే ఈ నూనెను వేస్ట్ చేయవలసిన అవసరం లేదు

ఇప్పుడు చెప్పే విధంగా వాడుకోవచ్చు. కరెంటు పోయినప్పుడు ప్రమిదల్లో ఈ నూనె పోసి దీపాలు వెలిగించుకోవచ్చు. రాత్రి పూట చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. కాగితానికి వాడిన నూనె రాసి పురుగులు వచ్చే చోట వేలాడదీస్తే దానికి అతుక్కుంటాయి. తెల్లారాక ఆ కాగితాన్ని పారేయవచ్చు.

లెదర్‌తో చేసిన బ్యాగులు, ఇతర వస్తువులను ఈ నూనెతో తుడిస్తే స్మూత్‌గా మారతాయి. ఈ నూనెలో కొద్దిగా వెనిగర్‌ కలిపి వుడ్‌ ఫర్నిచర్‌ను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News