Kitchenvantalu

Garlic Smell:చేతికి వెల్లుల్లి వాసన వస్తోందా? ఇలా తొలగించుకోండి

Garlic Smell Remove Tips : వెల్లుల్లి వాసన కారణంగా చాలా మంది వెల్లుల్లికి దూరంగా ఉంటారు. సాదారణంగా వెల్లుల్లి పాయను ముట్టుకున్నామంటే చేతులకు వాసన తొందరగా పోదు. అదే వెల్లుల్లిపాయను కోసామంటే ఆ వాసన అంత తొందరగా పోదు. అయితే ఈ ఇంటి చిట్కాల ద్వారా తొందరగా పోయేలా చేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లి వాసన వస్తున్న వేళ్ళను నీటి దార కింద పెట్టి స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో వేళ్ళను రుద్దాలి. ఆ తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటే వాసన పోతుంది.

వెల్లుల్లి వాసన పోవటానికి చేతులకు కాఫీ పొడి లేదా డికాషన్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

నిమ్మరసంలో ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంను కొంచెం అరచేతిలోకి తీసుకోని చేతులను బాగా రుద్ది కడగాలి.

చేతులకు ఆవాల నూనెను అప్లై చేసి, సున్నితంగా రుద్ది 5 నిమిషాలు అయ్యాక చేతులను శుభ్రం చేసుకుంటే చేతుల నుండి వెల్లుల్లి వాసన పోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Click Here To Follow Chaipakodi On Google News