Kitchenvantalu

Dondakaya Pachi kobbari Karam: దొండకాయ పచ్చికొబ్బరి కారం..ఇలా చేయాలి.. అన్నంలో నెయ్యితో తింటే.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Dondakaya Pachi kobbari Karam Recipe: దొండకాయ అంటే ఇష్టంగా తినేవాల్ల సంఖ్య చాల తక్కువనే చెప్పాలి. కాని దొండకాయలో ఉండే పోషకాల గురించి కాస్తా ఆలోచించి , కాసింత పచ్చి కొబ్బరి యాడ్ చేసి చేసారంటే, దొండకాయ కూడా మీ ఫేవరేట్ వెజిటెబుల్ లిస్ట్ లోకి చేరిపోతుంది.

కావాల్సిన పధార్ధాలు
పచ్చికొబ్బరి కారం..
అల్లం- 1 ఇంచ్
పచ్చిమిర్చి- 6-7
పచ్చికొబ్బరి- 1 కప్పు
వేపుడు కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు- 1 టీ స్పూన్
మినపప్పు- 1 టేబుల్ స్పూన్
శెనగపప్పు – 1 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి- 2
జీలకర్ర- 1 టీ స్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
దొండకాయ ముక్కలు- ½ kg
ఉప్పు – తగినంత
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్

తయారి విధానం
1.ఒక మిక్సి జార్ తీసుకొని అందులోకి అల్లం,పచ్చిమిర్చి వేసి నీళ్లు యాడ్ చెయ్యకుండా బరకగా గ్రైండ్ చేసిపెట్టుకోండి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడిచేసి అందులోకి ఆవాలు,మినపప్పు,శెనగపప్పు,ఎండుమిర్చి,కరివేపాకు,జీలకర్ర వేసుకోని తాలింపుని మీడియం ఫ్లేమ్ పై దోరగా వేపుకోవాలి.

3.వేగిన తాలింపులో తరిగిన దొండకాయ ముక్కలు,ఉప్పు వేసి కలిపి మూతపెట్టుకోవాలి.
4.మద్య మద్యలో కలుపుతూ ఉడికిస్తే దొండకాయలు సుమారు ఇరవై నిమిషాలకు మగ్గుతాయి.
5.ఉడికిన దొండకాయ ముక్కల్లోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు,మూడు నిమిషాలు మగ్గించాలి.
6.చివరగా కొత్తి మీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ పచ్చికొబ్బరికారం రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News