Godavari:గోదావరి సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా ?
Godavari Movie:ఎప్పుడో అందాల రాముడు మూవీ అక్కినేనితో గోదావరి మీద లాంచీలోనే మొత్తం షూటింగ్ జరిపిన హిట్ చిత్రంగా నిలిస్తే, మళ్ళీ అక్కినేని మనవడు సుమంత్ హీరోగా గోదావరి మీద తీసిన సినిమా గోదావరి మూవీ. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా హిట్ అందుకుంది.
ఈ మూవీలో కంటెంట్ అలాంటిది. నిజానికి గోదావరి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అలనాటి మూగమనసులు మూవీ నుంచి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అలాంటి గోదావరి పేరునే టైటిల్ గా పెట్టి మనుషుల మధ్య సున్నిత భావాలను ఫీల్ గుడ్ మూవీగా శేఖర్ కమ్ముల తీసి శెభాష్ అనిపించు కున్నాడు.
భద్రాచలానికి బోట్ లో వెళ్ళేటప్పుడు పాపికొండలు ,అక్కడి దృశ్యాలు ఆ పాత్రలన్నీ మనచుట్టునే ఉన్నట్లు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. సుమంత్ ,కమిలిని ముఖర్జీ లను సీత, రామ్ గా అందమైన పాత్రలుగా మలిచి,ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకునేలా, గౌరవించుకునేలా తీర్చిదిద్దడంతో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు. రాజీ ,రవీందర్ పాత్రలు కూడా అలానే ఉంటాయి.
ఎవరి భావాలూ వారివి, ఎవరి అభిరుచులు వారివి. ఒకరినొకరు అర్ధంచేసుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుంటూ ముందుకు సాగడమే జీవితం అని చాటిన చిత్రం గోదావరి మూవీ అర్ధం. అందంగాలేనా అసలేం బాలేనా ,నీజోడీ కానా,అంత అలుసైపోయానా అసలేం కానా అంటూ తన మనసులో మాట బయట పెట్టె పల్లెపడుచు సీత పాత్రను అందంగా తీర్చిదిద్దారు.
తన ప్రేమను రామ్ అర్ధం చేసుకోలేదని అంతలోనే బాధ పడ్డం కూడా మరీ చిత్రంగా తీసాడు. రాముడికి సీత ఒక్కటే. ఆసీత తానే కావాలి అనే సీత క్యారెక్టర్, పుల్లట్ల పుల్లమ్మ,చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకుని కోటిగాడు,బ్రీడ్ కుక్కతో ఫ్రీడమ్ గురించి చెప్పే మాటలు, కొంత వరకూ భరించే చిలకరాముడు ఇలా అన్ని పాత్రలను శేఖర్ కమ్ముల గోదావరిలో ఆవిష్కరించి,గోదావరి మూవీని చిరస్మరణీయం చేసాడు.