Kitchenvantalu

Socks Washing Tips:నల్లగా, మురికిగా మారిన సాక్స్ తెల్లగా మెరవాలంటే..ఇలా చేస్తే సరి

Socks Washing Tips in telugu:వర్షాకాలంలో బట్టలను ఉతకాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మురికిగా నల్లగా మారిన సాక్స్ ఉతకాలంటే పెద్ద టాస్క్ అవుతుంది. పిల్లలు స్కూల్ కి వెళ్తూ సాక్స్ వేసుకోవడం సాధారణమే. వారు స్కూల్ నుంచి వచ్చేసరికి సాక్స్ నల్లగా మురికిగా మారిపోతాయి. వీటిని శుభ్రం చేయాలంటే కష్టం. తెల్లటి సాక్స్ లను శుభ్రం చేయటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

ఒక బకెట్ లో వేడి నీటిని పోసి రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ కలపాలి. దీనిలో మురికిగా మారిన సాక్స్ వేసి రెండు నుంచి మూడు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత చేతులకు డిటర్జెంట్ రాసుకొని రుద్దితే సరిపోతుంది. ఆ తర్వాత సాక్స్ కి వెనిగర్ రాసి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన సాక్స్ తెల్లగా మెరుస్తూ ఉంటాయి.

సాక్స్ శుభ్రం చేయడానికి నిమ్మకాయ కూడా చాలా బాగా సహాయపడుతుంది. వేడినీటిలో నిమ్మరసం, డిష్ సోప్ వేసి ఆ మిశ్రమంలో సాక్స్ లను పావు గంట సేపు నానబెట్టి అ తర్వాత రుద్ది ఉతికితే తెల్లగా మెరుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."