Kitchenvantalu

Aloo Brinjal curry:ఆలూ వంకాయ కర్రీ రుచిగా రావాలంటే ఇలా చేయండి.. రైస్ లోకి టేస్ట్ అదిరిపోతోంది

Aloo Brinjal curry Recipe: వెజిటేరియన్స్ ఎంతో ఇష్టపడే ఆలు, వంకాయ కాంబినేషన్ ఎప్పుడు,ఎలా చేసినా బాగుంటుంది.ఇంకాస్తా చింతపండు యాడ్ చేసి వండితే రుచి ఇంకా అదిరిపోతుంది ఓసారి మీరు ట్రై చేయండి.

కావాల్సిన పధార్ధాలు
వంకాయ ముక్కలు- 250 గ్రాములు
ఆలుగడ్డ – 150 గ్రాములు
మునక్కాడ- 1
ఉల్లిపాయ తరుగు- 2
పచ్చిమర్చి- 2
టమాటో తరుగు- 3
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
ఎండు మిర్చి- 2
ఉప్పు- తగినంత
పసుపు- ¼ టీస్పూన్
కారం- 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి- 1 టీస్పూన్
జీలకర్ర పొడి- 1 టీస్పూన్
గరం మసాల- ½ టీస్పూన్
నూనె- ¼ కప్పు
చింతపండు రసం- ½ లీటర్

తయారి విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడిచేసి అందులో నార తీసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేపి తీసి పక్కన పెట్టుకోండి.
2.అదూ కడాయి లో వంకాయలు, ఆలు గడ్డలు వేపి కాస్త మెత్తపడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి.
3.మిగిలిన నూనెలో ఆవాలు ,జీలకర్ర,ఎండు మిర్చి కరివేపాకు వేసి వేపుకోవాలి.తర్వాల ఉల్లిపాయతరుగు ఉప్పు వేసి మెత్తపడేదాక వేపుకోవాలి.
4.మెత్తపడిన ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాల పొడి ,జీలకర్ర పొడి ,కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మాడిపోకుండా వేపుకోవాలి.

5.వేగిన కారంలో టమాటో తరుగు వేసి గుజ్జుగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
6.మగ్గిన టమాటలో వేపుకున్న ఆలు ,వంకాయ, మునక్కాడ ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టుకోని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
7.మగ్గిన తర్వాత అందులోకి చింతపండు రసం వేసి మునక్కాడ మెత్తపడే వరకు మీడియం ఫ్లేమ్ పై మూత పెట్టుకోని ఉడికించాలి.
8.మునక్కాడ మెత్తపడ్డాక చివరగా కొత్తి మీర తరుగు వేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఆలు వంకాయ కర్రీ తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News