Kitchenvantalu

Car AC Tips:మీ కారులో ఏసీ చాలా తక్కువగా వస్తోందా.. ఇలా చేస్తే చాలు చిల్ కావొచ్చు..

Car AC Tips in telugu: ఈ వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కారులో ఏసీ లేకుండా ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి కారులో ఏసి నుంచి ఎక్కువ చలదనం కావాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించండి.

కారులో ఏసీ ని ఆన్ చేసే ముందు కారులో ఉన్న వేడిని తీసివేయాలి. దీనికోసం ఇగ్నిషన్ ఆన్ చేసే ముందు కారు కిటికీలను కిందకి తిప్పాలి. కారును పార్కు చేసే సమయంలో చల్లని ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. ఎండలో కారు పార్క్ చేయకుండా జాగ్రత్త పడాలి.

ఏసి కండెన్సర్ దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రయాణిస్తున్న వాహనంలో అధిక వేడిని బయటికి పంపి చల్లపరచడానికి సహాయపడుతుంది. కారు ఏసీని కాసేపు ఆన్ చేసిన తర్వాత చల్లటి గాలి వచ్చిన తర్వాత రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆన్ చేయాలి. రీసర్క్యులేషన్ మోడ్‌లో.. AC బయటి గాలిని తీసుకోదు. కారు క్యాబిన్‌లో లభించే గాలిని ఉపయోగిస్తుంది. తద్వారా ACపై ఒత్తిడి తగ్గుతుంది.

కారు AC ని సరైన సమయంలో క్రమం తప్పకుండా సర్వీస్ చేయించాలి. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు మీ కారు కిటికీలు పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కారు క్యాబిన్ చాలా తొందరగా చల్లగా అవుతుంది. డర్టీ ఏసీ ఫిల్టర్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే కారులో ఏసీ చాలా ఎక్కువగా వచ్చి చాలా తొందరగా కూల్ అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.