Kitchenvantalu

Cleaning Tips :సోఫా ఎంత పాతదైనా ఇలా చేస్తే కేవలం 10 నిమిషాల్లో కొత్తగా మారిపోతుంది..!

Sofa Cleaning Tips : సాధారణంగా ప్రతి ఇంటిలో ఫర్నిచర్ ఉంటుంది. ఆ ఫర్నిచర్ లో సోఫాలు తప్పనిసరిగా ఉంటాయి. సోఫాలను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మురికి పడుతూనే ఉంటాయి. పాత సోఫాలను కూడా కొత్త వాటిలా మెరుస్గాతూ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. సోఫా మీద మురికి తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

మనలో చాలా మంది సోఫాలను శుభ్రం చేయటానికి వెలాసిటీ క్లీనర్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది సోఫా నుండి దుమ్మును మాత్రమే శుభ్రం చేస్తుంది. మరకలను శుభ్రం చేయదు. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే 10 ఏళ్ల సోఫాను కూడా 10 నిమిషాల్లో కొత్తగా కనిపించేలా చేస్తుంది.

ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో వెనిగర్ , లాండ్రీ ద్రవాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో క్లాత్ ని ముంచి మరక ఉన్న ప్రదేశంలో రుద్దితే సరిపోతుంది. మొండి మరకల కోసం, గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడాను కలిపి మరకలపై రుద్ది…ఆ తర్వాత తడి క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది.

అదే తోలు సోఫాను శుభ్రం చేయడానికి నీరు, వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. అవిసె గింజల నూనెను వెనిగర్‌తో కలపండి . ఈ మిశ్రమంతో సోఫాను శుభ్రం చేస్తే కొత్త సోఫా మాదిరిగా మెరిసిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.