MoviesTollywood news in telugu

Rakshakudu Movie:రక్షకుడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు … ఎన్ని కోట్ల లాభమో…?

Rakshakudu Movie:అక్కినేని నాగార్జున మంచి రేంజ్ లో కొనసాగుతున్న రోజులవి. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది అప్పట్లో … సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. హిందీలో మంచి మార్కెట్ ఉంది. సరిగ్గా అదే సమయంలో రెండు భాషల్లో రక్షకుడు మూవీ తీశారు.

సూపర్ స్టార్ కృష్ణ తీసిన సింహాసనం సినిమా తర్వాత అంతటి భారీ స్థాయిలో తీసిన రక్షకుడు సినిమా ను భారీ చిత్రాల నిర్మాత కుంజుమోహన్ ప్లాన్ చేసాడు. విశ్వ సుందరి సుస్మితా సేన్ హీరోయిన్,ఏ ఆర్ రెహ్మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిర్ణయించారు. నాగార్జునకు రెండు కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన సినిమా ఇది. అప్పట్లో టాప్ హీరోయిన్స్ కి 25లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేవారట.

దాంతో 10కోట్ల బడ్జెట్ తో రక్షకుడు స్టార్ట్ చేసారు. ఇదిఅప్పట్లో చాలా ఎక్కువ బడ్జెట్. 1997అక్టోబర్ 30న రిలీజ్ డేట్ ఇచ్చారు. కోటి 40లక్షలు ఆడియో రైట్స్ వచ్చాయి. సోనియా సాంగ్ అప్పట్లో సూపర్ హిట్. 15కోట్ల పైనే బిజినెస్ అయింది. హిందీ,తెలుగు,తమిళ్ లో స్టార్ ఇమేజ్ గల హీరో కావాలని భావించి నాగార్జునను ఎంపికచేసినట్లు చిత్ర నిర్మాత కుంజుమోహన్ చెప్పుకొచ్చారు.

ఇక మోహన్ బాబు సినిమా కలెక్టర్ గారు సినిమా ఆడుతున్న థియేటర్స్ లో రక్షకుడు మూవీ ట్రైలర్ వేయడంతో మంచి డిమాండ్ వచ్చింది. దానికి తోడు ట్రైలర్ చూడ్డం కోసం కలెక్టర్ గారు సినిమాకి కూడా జనం వచ్చేవారట.ట్రైలర్ లో వచ్చిన సన్నివేశాలు చూసి నాగార్జున ఫాన్స్ పిచ్చెక్కిపోయారు. కారు లోయలో పడడం, ట్యాంకర్ పేలిపోవడం,బైక్ ఛేంజింగ్ ఇలా అన్నీ నాగ్ ఫాన్స్ కి నచ్చేశాయ్.

తమిళంలో రక్షకన్ గా, తెలుగులో రక్షకుడిగా విడుదలైంది. అప్పటికే మాస్టర్,పెళ్లిచేసుకుందాం సినిమాలు హిట్ అయ్యాయి. అదేసమయంలో బాలయ్య దేవుడు మూవీ వచ్చింది. అయితే తమిళం,కేరళలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి.

కొన్నిచోట్ల ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే సిటీ కేబుల్ లో రోజుకి రెండు సార్లు చొప్పున 10సార్లు వేయగా, నెలరోజుల తర్వాత ఈటివి,జెమిని లలో ఒకేరోజు ప్రదర్శించబడింది. ఇలా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా హిట్ అయివుంటే ఇంకెలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు