Kitchenvantalu

Peanut Charu: పల్లీలతో పచ్చి పులుసు ఇలా ట్రై చేయండి.. ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే..

Peanut Charu Recipe: అన్నం ,ఇడ్లీ,ఉప్మా,దోశ అన్నింటిలోకి సరైనా కాంబినేషన్ గా ఉండే పల్లీ పచ్చిపులుసు శనగా చారు ఎప్పుడైనా ట్రై చేసారా.

కావాల్సిన పదార్ధాలు
పల్లీలు – ½ కప్పు
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండు మిర్చి – 2-3
చింతపండు – 20 గ్రాములు
ఉప్పు – తగినంత
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – ¼ కప్పు
పసుపు – ½ టీ స్పూన్
నూనె – 1 ½ టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని పల్లీలను తక్కువ మంటపై వేయించుకోవాలి.అదే ప్యాన్ లోకి ఎండు మిర్చి కూడ వేసి వేపుకోవాలి.
2.చింతపండును గుజ్జును తయారు చేసుకోవాలి.
3.వేపుకున్న పల్లీలు,ఎండు మిర్చి ఉప్పు ,జీలకర్ర మిక్సి లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.గ్రైండ్ చేసుకున్న పల్లీ పేస్ట్ లో సరిపడా నీళ్లు వేసుకోని కలుపుకోవాలి.

5.ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఉల్లిపాయలు కట్ చేసుకోని వేసుకోని,అందులోకి ప్రిపేర్ చేసుకున్న పల్లీ పేస్ట్ నీల్లను,చింతపండు గుజ్జును వేసి బాగా మిక్సి చేసుకోవాలి.
6.చిక్కగా మరి పల్చగా కాకుండా నీళ్లను అడ్జస్ట్ చేసుకోవాలి.
7.రుచికి సరిపడా కారం,ఉప్పును అవసరమైతే యాడ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగిన తాలింపును పల్లీ పచ్చిపులుసులో కలుపుకోవాలి.