Kitchenvantalu

Shoe Bites:కొత్తగా కొన్న చెప్పులు కరుస్తున్నాయా…వీటిని ఫాలో అయితే సరి

Home Remedies for Shoe Bites : అందమైన డిజైన్ ఉన్న చెప్పులను ఏంతో మోజు పడి మరీ కొనుక్కుంటాం. అయితే అవి కొన్ని రోజుల పాటు పాదాల మీద ఒత్తిడి కలిగించి కరుస్తూ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కొత్త చెప్పులు కరిచినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించు కోవటానికి సాధారణమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్ లో వేసి కాపడం పెట్టటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది నొప్పిని తగ్గించటమే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది.

కలబందలో హీలింగ్ లక్షణాలు ఉండుట వలన నొప్పి ప్రాంతంలో కలబంద జెల్ ని రాస్తే నొప్పి,మంట అన్ని తగ్గిపోతాయి. ఇంటి పెరటిలో ఉండే కలబంద మొక్కను ఉపయోగించవచ్చు. ఇంటిలో లేనివారు మార్కెట్ లో దొరికే జెల్ ని వాడవచ్చు.

ఆస్ప్రిన్ మాత్ర కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆస్ప్రిన్ మాత్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన నొప్పి,వాపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆస్ప్రిన్ మాత్రను పొడిగా చేసి దానిలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.