Kitchenvantalu

Rava Chegodilu:రవ్వతో ఇలా చేస్తే చేగోడీలు కరకరలాడుతూ వస్తాయి

Rava Chegodilu Recipe: పిల్లలైనా పెద్దలైనా  ఖాలీ సమయం దొరికెతే చాలు చిరుతిండి కోసం వెతుకుతూ ఉంటారు. టైంపాస్ కోసం మురుకులు,చేగొడిలు పిల్లలైతే చాలా ఇష్టపడ్తారు.రవ్వతో చెగోడీలు ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉప్మా రవ్వ – 4 కప్పులు
పెసరపప్పు – 1 కప్పు
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – 2 టీ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వులు – 4 టీ స్పూన్స్
నూనె – డీప్ ఫ్రైకీ సరిపడా

తయారీ విధానం
1.ముందుగా పెసరపప్పును పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
2.ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వ తీసుకోని అందులోకి కారం,ఉప్పు,జీలకర్ర,నువ్వులు వేసుకోని బాగా మిక్సి చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి ఆరు కప్పుల నీళ్లను తీసుకోని స్టవ్ పై పెట్టి మరిగించాలి.
4.మరుగుతున్న నీటిని మంటను తగ్గించి నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి పసుపు యాడ్ చేసి కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేస్తు ఉండలు లేకుంటా కలుపుకోవాలి.

6.5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
7.ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేడెక్కనివ్వాలి.
9.ఉడికిన పిండితో మూత పై చిన్న రింగులగా చుట్టుకోవాలి.
10.చుట్టుకున్న చెగోడీలను ఆయిల్ లో ఎర్రగా కాల్చుకోవాలి.
11. చల్లారిన తర్వాత ఈ చెగోడిలను ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే నెల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.