Kitchenvantalu

Bellam Jilebi:కేవలం 15 నిమిషాల్లో ఇలా ఈజీగా బెల్లం జిలేబీలు చేసుకోండి.. మూడు నాలుగు రోజులైనా మెత్తబడవు

Bellam Jilebi Recipe: చూడగానే నోరూరి పోయే జిలేబి అంటే ఇష్టపడని వారుండరు. బెల్లం పాకంతో జ్యూసీ జ్యూసీ ,క్రంచి జిలేబి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 కప్పు
పుల్లని పెరుగు – ½ కప్పు
నీళ్లు – 2 కప్పులు
ఉప్పు – చిటికెడు
బేకింగ్ సోడా – చిటికెడు
బెల్లం – 1 కప్పు
నిమ్మరసం – ½ టీ స్పూన్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి మైదా వేసుకోవాలి.
2.వేరొక గిన్నెలో పుల్లని పెరుగు,నీళ్లు కలుపుకోని మజ్జిక తయారులచేసుకోవాలి.
3.మైదాలో మజ్జిక ను వేస్తు జిలేబి పిండిని కలుపుకోవాలి.అవసరాన్ని పట్టి నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.
4.ఇప్పుడు కలుపుకున్న పిండిలోకి బేకింగ్ సోడా,ఉప్పు వేసి బాగా మిక్సి చేసి గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక కప్పు తురిమిన బెల్లం ,½ కప్పు నీళ్లను ప్యాన్ లో వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి.
6.ఇప్పుడు కరిగిన బెల్లం సిరప్ లో నిమ్మరసం కలుపుకోవాలి.

7. సిరప్ లోకి యాలకుల పొడి నెయ్యి వేసి బాగా కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై బాండి పెట్టుకోని నూనె వేడిచేసుకోవాలి.
9.కలుపుకున్న జిలేబి పిండిలో నచ్చిన ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోవాలి.
10.ఇప్పుడు జిలేబిలు వేయడానికి సాస్ బాటిల్ ,లేదా క్లాత్ జిప్ లాక్ కవర్ తీసుకోని అందులో పిండి పోసుకోవాలి.
11.కలుపుకున్న పిండి మరి పల్చగా,లేదా చిక్కగా ఉండకూడదు.
12.వేడెక్కిన నూనెలో జిలేబిలను వేసుకోవాలి.
13.మీడియం ఫ్లేమ్ పై క్రిస్పిగా వేయించుకోని జల్లిగరిట సాయంతో తీసి బెల్లం సిరప్ లో కాసేపు ముంచి తీస్తే జిలేబిలు రెడీ.