Kitchenvantalu

Watermelon Dosa:ఎప్పుడు మాములు Dosa కాకుండా ఈ స్టైల్ లో Dosa ట్రై చేయండి…సూపర్ టేస్ట్…

Watermelon Dosa Recipe:మనం సాధారణంగా పుచ్చకాయలో ఎర్రటి భాగాన్ని తిని తెల్లని భాగాన్ని పాడేస్తూ ఉంటాం. కానీ తెల్లని భాగంలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఇప్పుడు పుచ్చకాయలో తెల్లటి బాగాన్ని ఉపయోగంచి రుచికరమైన Dosaను తయారు చేసుకుందాం.

కావలసిన పదార్ధాలు
1 కప్పు బియ్యం
2 టేబుల్ స్పూన్లు శనగపప్పు
1/2 స్పూన్ మెంతులు
పుచ్చకాయ (తెల్ల భాగం మాత్రమే – ముక్కలు)
2 చిన్న ముక్కలు అల్లం
3 పచ్చి మిరపకాయలు

తయారి విధానం
ఒక బౌల్ లో బియ్యం,శనగపప్పు,మెంతులు వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. పుచ్చకాయ ముక్కలో తెల్లటి బాగాన్ని తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం,శనగపప్పు,పుచ్చకాయ ముక్కలు,అల్లం ముక్కలు,పచ్చిమిరప ముక్కలు, అవసరమైన నీటిని పోసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోని ఒక గంట అలా వదిలేయాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి వేడి చేసి నూనె వేసి ఒక గరిటె పిండిని వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. Dosa గోల్డ్ కలర్ వచ్చ్హే వరకు వేగించి వెనక్కి తిప్పి కూడా వేగించాలి. మీకు నచ్చిన చట్నీ లేదా ఊరగాయతో వేడి వేడి పుచ్చకాయ Dosa ను సర్వ్ చేయండి.