Kitchenvantalu

Jonna Murukulu:సంవత్సరం నిల్వ ఉండే కర కరలాడే జొన్న పిండి మురుకులు టేస్టీగా చాలా ఈజీగా చేయొచ్చు

Jonna Murukulu Recipe :జొన్న పిండితో రుచికరమైన వడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వడియాలను ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. అన్నం మరియు పప్పుతో సైడ్ డిష్‌గా తినవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేగించుకొని తినవచ్చు.

కావలసిన పదార్ధాలు
1 కప్పు జొన్న పిండి
4-5 పచ్చి మిరపకాయలు
2-3 వెల్లుల్లి రెబ్బలు
1 కప్పు నీరు
1 స్పూన్ ఉప్పు
1 స్పూన్ జీలకర్ర
3 స్పూన్ నువ్వులు

తయారి విధానం
ముందుగా పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిని కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి 1 కప్పు నీరు మరియు 1 టీస్పూన్ నూనె వేసి నీటిని మరిగించాలి. ఆ తర్వాత 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర మరియు 3 టీస్పూన్ల నువ్వులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత జొన్న పిండి వేస్తూ బాగా కలపాలి. జొన్న పిండి నీటిలో బాగా కలిసేవరకు కలపాలి.

ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి జంతికల గొట్టంలో పెట్టి జంతికల మాదిరిగా చుట్టి ఎండలో ఎండనివ్వాలి. ఇవి బాగా ఎండాకా డబ్బాలో పోసుకొని నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. వీటిని అవసరమైనప్పుడు నూనెలో వేగించుకొని తినాలి.