Millets:చిరుధాన్యాలు తినే విషయంలో 99 % మంది చేసే ఈ పొరపాటుని మీరు అసలు చేయకండి
Millets Health Benefits In telugu: చిరుధాన్యాల వాడకం ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరిగింది. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, వరిగెలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు, సామలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాలు మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఆమంచి ఆహారం అని చెప్పవచ్చు.
ఎందుకంటే వీటిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు ఉండడమే కాకుండా, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కర స్థాయిలు త్వరగా పెరగవు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బీ, నియాసిన్, ఫాస్ఫరస్, పోటాషియం, యాంటీయాక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, పైబర్ సమృద్దిగా ఉంటాయి.
Millets లో ఉండే పైబర్ ప్రిబయోటిక్‌గా మారి కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా దోహదపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. Millets తినటం అనేది నిదానంగా అలవాటు చేసుకోవాలి. ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల వీటిని వండటానికి ముందు నానబెట్టాలి.
Millets లో యాంటీ-న్యూట్రియెంట్ అయిన ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది ఇతర పోషకాలను శరీరం శోషించకుండా అడ్డు పడుతుంది. అయితే Millets ని నానబెట్టినప్పుడు ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. వీటిలో ఎక్కువగా పైబర్ ఉండటం వలన… నిదానంగా జీర్ణం అవ్వటం వలన కొంత మందిలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల ఈ చిరు ధాన్యాలను అలవాటు చేసుకునే ముందు తక్కువ మోతాదులో ప్రారంభించాలి. ముందుగా రాగులు, కొర్రలు వంటి వాటితో ప్రారంభించి ఆ తర్వాత జొన్నలు, సజ్జలు వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అయోడిన్ శోషణలో ఆటంకాలను కలిగిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.