Kitchenvantalu

Badam Shake:బాదం పాలు బయట కూల్ డ్రింక్ షాప్ లో లాంటి రుచి రావాలంటే ఇలా చేస్తే సరి..

Badam Shake Recipe: లిక్విడ్ ఫుడ్స్ లో మిల్క్ షేక్స్,ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. ఏ కాలంలో అయినా చల్ల చల్లగా కూల్ కూల్ గా బాదం షేక్ ని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పధార్ధాలు
బాదం పప్పులు- 50 గ్రాములు
పాలు- 1 లీటర్
పంచదార- 1/3 కప్పు
కుంకుమ పువ్వు నీళ్లు- 3 టేబుల్ స్పూన్స్
కస్ట్రర్డ్ పౌడర్ – 2 టీ స్పూన్స్

తయారి విధానం
1.బాదం పప్పులను వేడినీళ్లలో నానబెట్టి పొట్టు తీసి మిక్సి జార్లో వేసుకోని 200 ml నీళ్లు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2.స్టవ్ పాలు పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరింగిచాలి.
3.మరుగుతున్న పాలలో బాదం పేస్ట్ వేసి రెండు ,మూడు పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పై మరగనివ్వాలి.

4.1/4 కప్పు పాలల్లో వెనీల ఫ్లేవర్ కస్ట్రర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
5.మరిగిన బాదం పాలల్లో పంచదార,కుంకుమపువ్వు నీళ్లు,కస్ట్రర్డ్ పౌడర్ పాలు,ఒక్క డ్రాప్ కలర్ వేసి అన్ని కలుపుకోని మరగనివ్వాలి.
6.బాదం పాలు చిక్క బడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోని.సర్వ్ చేసుకునే ముందు బ్లెండర్ లో బ్లెండ్ చేసుకోని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News