Kitchenvantalu

Bendakaya Tomato Salan:రోటి,పులావ్‌, బిర్యానీల‌లోకి ఎంతో రుచిగా ఉండే.. ట‌మాటా బెండకాయ సాల‌న్‌.. ఇలా చేయాలి..!

Bendakaya Tomato Salan Recipe: స్పెషల్ అనగానే, పలావులు, సలాన్ లే గుర్తుకు వస్తుంటాయి. హైదరాబాదీ స్పెషల్, బెండకాయ టమాటో సలాన్ ఎప్పుడైనా ట్రై చేసారా.
లేకపోతే ఇప్పుడు ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
సలాన్ పేస్ట్ కోసం..
పల్లీలు – 1/4కప్పు
ఎండు కొబ్బరి -1/4కప్పు
ఎండుమిర్చి – 8
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
నువ్వులు – ¼ టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
గసగసాలు – ½ టీ స్పూన్

సలాన్ కోసం..
నూనె – 1/4కప్పు
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 3
మెంతులు – ¼ టీ స్పూన్
కాలోంజీ – 2 చిటికెలు
జీలకర్ర – 1/2టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
బెండకాయ ముక్కలు – 150 గ్రాములు
టమాటో ముక్కలు – 3
ఉల్లిపాయ తరుగు – 1/2కప్పు
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
చింతపండు పులుసు – 1 కప్పు
నీళ్లు- 800ml
బెల్లం – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, సలాన్ కోసం ఉంచిన పదార్ధాలను, వేసి, ఎర్రగా, వేపి పక్కన పెట్టుకోవాలి.
2. వేపుకున్న పదార్ధాలు అన్నిటిని, మిక్సీ జార్ లోకి వేసి, కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని, బరకగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేడి చేసి, అందులోకి బెండకాయ ముక్కలు వేసి, ఎర్రగా వేపి, తీసుకోవాలి, తర్వాత టమాటో ముక్కలను కూడా వేపి తీసుకోవాలి.
4. ఇప్పుడు మిగిలిన నూనెలో ఆవాలు, మెంతులు, కాలోంజి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపాలి.
5. వేగిన తాళింపులో ఉల్లిపాయలు, వేసుకుని, మెత్తపడేదాకా వేగనివ్వాలి.

6. వేగిన ఉల్లిపాయల్లో, ఉప్పు , పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి.
7. ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసుకున్న సలాన్ పేస్ట్, చింతపండు పులుసు పోసి, 4 నిముషాలు హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
8. మరుగుతున్న పులుసులో నీళ్లు పోసి, 20 నిముషాలు మరిగించాలి.
9. మరుగుతున్న పులుసులో బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి, నూనె పైకి తేలే వరకు, ఉడికించాలి.
10. చివరిగా బెల్లం వేసుకుని, బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.
11. అంతే వేడి వేడి బెండకాయ సలాన్ తయార్.
Click Here To Follow Chaipakodi On Google News