Kitchenvantalu

Crispy Masala Vada:స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు ఇలా చేసి చూడండి కరకరలాడుతూ వస్తాయి

Crispy Masala Vada Recipe: సాయంత్రం అయిందంటే చాలు, చిరు తిండ్ల కోసం, టైమ్ పాస్ కోసం, స్నాక్స్ వెతుకుతూ ఉంటాం.శనగపప్పుతో, మసాలా వడలు చేసి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
పచ్చిశగనపప్పు – 1 కప్పు
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
పచ్చిమిర్చి తరుగు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
సోయా కూర – 3 టేబుల్ స్పూన్స్ ( ఆప్షనల్)

తయారీ విధానం
1.శుభ్రంగా కడిగి 4 గంటలు నానపెట్టుకున్న, పచ్చిశగనపప్పును, ఒక పిడికెడు పక్కనపెట్టుకుని, మిగిలిన పప్పును వడకట్టుకోవాలి.
2. వడకట్టిన పప్పును, మిక్సీ జార్లోకి వేసుకుని, 2 చెంచాలు నీళ్లు వేసుకుని, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైండ్ చేసుకున్న పప్పులోకి, పక్కనపెట్టిన శనగపప్పు, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి, గట్టిగా, వత్తుతూ వడ పిండి కలుపుకోవాలి.

4. స్టవ్ పై కడాయి పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, వెడెక్కనివ్వాలి.
5. ఇప్పుడు చేతులు తడి చేసుకుని, కొద్దిగా పిండి తీసుకుని, చిన్న సైజ్ లో వడలు వత్తుకుని, నూనెలో వేసుకోవాలి.
6. మీడియం ఫ్లేమ్ పై రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేపుకోని తీసేసుకోవాలి.
7. అంతే మసాలా వడ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News