Kitchenvantalu

Beetroot Halwa:నోరూరించే బీట్‌రూట్‌ హల్వా తయారీ.. టేస్టీ అండ్ హెల్దీ..

Beetroot Halwa Recipe: క్యారేట్ హల్వా, సర్వ సాధారణంగా, అందరూ చేస్తూనే ఉంటారు. క్యారేట్ ప్లేస్ లో బీట్ రూట్ యాడ్ చేసుకుని,హల్వా చేయండి. కలర్ ఫుల్ గా , సూపర్ టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
బీట్ రూట్ తురుము – 1/2కేజీ
పాలు – 1 లీటర్
నెయ్యి – 75 నుంచి 100 గ్రాములు
జీడిపప్పులు – 20
కిస్ మిస్ లు –కొద్దిగా
పచ్చి కోవా – 50 గ్రాములు
యాలకుల పొడి – 1 టీ స్పూన్
పంచదార – 1/2కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నెయ్యి వేసి, కరిగిన నెయ్యిలో, జీడిపప్పు, కిస్ మిస్ వేసి వేగనివ్వాలి.
2. వేగిన కిస్ మిస్ లో బీట్ రూట్ తురుము వేసి, పచ్చిదనం పోయే దాకా వేపుకోవాలి.
3. వేగిన బిట్ రూట్ లో , పాలు పోసి, మీడియం ఫ్లేమ్ పై , దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.

4. 20 నుంచి 30 నిముషాలకు, హల్వా దగ్గర పడుతుంది.
5. అప్పుడు యాలకుల పొడి, పంచదార వేసి, మరో 5 నిముషాలు ఉడికించాలి.
6. ఇప్పుడు హల్వా దగ్గర పడ్డాక, చివరగా, కోవా, వేసి, కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7. అంతే, కలర్ ఫుల్ హెల్తీ, బీట్ రూట్ హల్వా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News