Kitchenvantalu

Rayalaseema Pulagam:కేవలం 20 నిమిషాల్లో అదిరిపోయే రాయలసీమ స్పెషల్ పెసరపప్పు పులగం

Rayalaseema Pulagam Recipe: కొన్ని ప్రాంతాలకే తెల్సిన వంటకాలు చాలానే ఉంటాయి. రాయలసీమలో సంప్రదాయ వంటకం పులగం మీకు తెలుసా. లేదంటే ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పెసరపప్పు – 1/2కప్పు
ఆవాలు – 1 టీ స్పూన్
మిరియాలు – ½ టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ చీలికలు – 1
కరివేపాకు రెబ్బలు – 2
పచ్చిమిర్చి చీలికలు – 4
టమాటాలు – 2
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీస్పూన్
నీళ్లు – 3 కప్పులు

తయారీ విధానం
1.పులగం కోసం, స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేపుకోవాలి.
2. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత, టమాటా ముక్కలు వేసి, 3నిముషాలు వేపుకోవాలి.

4. ఇప్పుడు అందులోకి, గంట ముందు నానపెట్టిన, బియ్యాన్ని, పెసరపప్పును వేసి తడిపోయో వరకు వేపుకోవాలి.
5. తడి ఇగిరిపోయాక, అందులోకి నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టుకుని, హై ఫ్లేమ్పై ఒక విజిల్, మీడియం ఫ్లేమ్ పై రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 20 నిముషాలు పక్కనపెట్టుకోవాలి.
6. 20 నిముషాల తర్వాత కుక్కర్ మూత తీసి, అడుగు నుంచి కలుపుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News