Kitchenvantalu

Bendakaya Pulusu: అమ్మమ్మల కాలం నాటి బెండకాయ పులుసు ఎంతో కమ్మగా … ఇలా చేసుకోండి

Bendakaya Pulusu Recipe: లేత బెండకాయలు, ఫ్రైకి ఎంత ఫేమసో, కాస్త ముదిరిన బెండకాయలతో పులుసు.. అంతే ఫేమస్. పుల్లపుల్లగా , స్పైసీ, స్పైసీగా బెండకాయ పులుసు ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బెండకాయ ముక్కలు – 300 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిశనగరప్పు – 1 టీస్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
ఎల్లిపాయ తరుగు – ½ కప్పు
పచ్చిమిర్చి – 4
ఎండుమిర్చి – 2
పసుపు – ¼ టీ స్పూన్
దంచిన వెల్లుల్లి – 5
చింతపండు గుజ్జు – 400ml
శనగపిండి నీళ్లు – 1 టేబుల్ స్పూన్
బెల్లం – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో ఆవాలు, మెంతులు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు వేసుకుని, వేపుకోవాలి.
2. వేగిన తాళింపులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేసి, వేపుకోవాలి.
3. వేగిన ఉల్లిపాయల్లో, పసుపు, బెండకాయ ముక్కలు వేసి, కలుపుకుని, 5 నిముషాల పాటు వేపాలి.

4. వేగిన బెండకాయ ముక్కల్లో, చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం వేసి, బెండకాయలు మెత్తపడేవరకు, మీడియం ఫ్లేమ్ పై మూత పెట్టుకుని, ఉడికించాలి.
5. బెండకాయలు మెత్తపడిన తర్వాత, పల్చగా కలుపుకున్న శగనపిండి నీళ్లు పోసి, మరో మూడు నిముషాలు ఉడికించి, దించేసుకోవాలి.
6. అంతే, బెండకాయ పులుసు తయారు అయినట్టే..
Click Here To Follow Chaipakodi On Google News