Kitchenvantalu

Cleaning Tips: వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికి పోయి కొత్తదానిలా మెరవాలంటే..

Cleaning Tips in telugu: వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికిని తొలగించటం చాలా కష్టమైన పని. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా మురికి తొలగిపోయి కొత్త వాటిలా మెరుస్తాయి.

గోరువెచ్చని నీటితో సర్ఫ్ కలిపి అందులో ముంచిన ఒక మెత్తటి క్లాత్‌తో ఫ్యాన్‌ను పూర్తిగా తుడవాలి.. ఆ తర్వాత మరొక తడి, శుభ్రమైన క్లాత్‌ తీసుకుని శుభ్తురంగా తుడవాలి. ఫ్యాన్‌ని శుభ్రపరిచే ముందు స్విచ్ ఆఫ్ చేసి, అన్‌ప్లగ్ చేయాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ గా చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ మొత్తం రాసి 10 నిమిషాలు అయ్యాక పొడి క్లాత్‌ తీసుకుని గట్టిగా తుడిచేస్తే సరిపోతుంది.

ఒక కప్పు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి. ముందుగా ఫ్యాన్‌ని తుడిచి, ఆ తర్వాత తయారు చేసిన మిశ్రమంలో తడి గుడ్డను ముంచి, మళ్లీ ఫ్యాన్‌ను బాగా తుడవండి. ఇలా చేస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికి తొలగిపోతాయి.

అలాగే నిమ్మరసం బదులు వెనిగర్ కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలు అన్ని బాగా పనిచేస్తాయి. అయితే మీకు వీలును బట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికిని తొలగించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."