Kitchenvantalu

Sweet Coconut Rice:కేవలం 10 నిమిషాల్లో టేస్టీగా సరికొత్త రెసిపీ తీపి కొబ్బరి అన్నం

Sweet Coconut Rice Recipe: పండుగలకు చేసుకునే, వెరైటీ స్వీట్స్ లో రవ్వ కేసరి, సేమియా, పరమాన్నం, మాత్రమే చేస్తుంటాం. ఓ సారి కొబ్బరి అన్నంతో స్వీట్ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
నీళ్లు – 1 కప్పు
పాలు లేదా కొబ్బరి పాలు – 1 కప్పు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 15
కిస్ మిస్ – 15
యాలకులు – 4
బెల్లం – 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.బియ్యంలో నీళ్లు ,పాలు, పోసుకుని, కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్ పై , ఒక విజిల్ రానివ్వాలి.
2. మీడియం ఫ్లేమ్ పై రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
3. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, నెయ్యి కరిగించి, జీడిపప్పు, కిస్ మిస్ లు వేయించి పక్కన పెట్టుకోవాలి.
4. అదే నెయ్యి లో బెల్లం,నీళ్లు, పోసుకుని, కరిగి కాస్త చిక్కపడనివ్వాలి.

5. చిక్కపడుతున్న బెల్లంలో యాలకులు, కొబ్బరి, వేసి ఇంకాస్త దగ్గర పడనివ్వాలి.
6. కొబ్బరి కాస్త ఉడికిన తర్వాత, ఉడికిన అన్నం వేసి, బాగా కలుపుకుని, వేయించి పెట్టుకున్న కిస్ మిస్, జీడిపప్పులను వేసి,
మూత పెట్టి, మరో 8 నిముషాలు, ఉడికించాలి.
7. అంతే, వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అయినట్లే.
Click Here To Follow Chaipakodi On Google News