Kitchenvantalu

Venna murukulu:క్రిస్పీగా గుల్లగా మరింత టేస్టీగా కమ్మని వెన్న మురుకులు

Venna Murukulu Recipe: కొన్ని తినుబండారాలను, సమయం సందర్భం అవసరం లేదు. ఆకలి, అంతకన్నా అవసరం లేదు. మొదలు పెడితే తింటూనే ఉంటాం.ఈవినింగ్ స్నాక్స్ కోసం, వెన్న మురుకులు ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పండి – 3 కప్పులు
తెల్ల వెన్న – 80 నుంచి 100 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
నువ్వులు – 2 టీ స్పూన్స్
వాము – 1 టీ స్పూన్
నీళ్లు – 425 ml
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులోకి బియ్యం పిండి, వెన్న వేసి, బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత మిగిలిన పదార్ధాలు వేసి, కలుపుకోవాలి.
3. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుంటూ, పిండిని మెత్తగా, ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనెను వేడి చేసుకోవాలి.
5. ఇప్పుడు కలుపుకున్న పిండిని, మురుకుల మిషన్ లో నింపుకుని, వెడెక్కిన నూనెలోకి వత్తుకోవాలి.
6. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి, లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు, కాల్చుకుని, బయటికి తీసుకోవాలి.
7. చల్లారిన తర్వాత, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News